CLW Recruitment: ఐటిఐ అర్హత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండానే టెన్త్ మార్కులతో ఉద్యోగవకాశాలు

CLW Recruitment 2021: నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిత్తరంజన్‌ లోని లోకో మోటివ్‌ వర్క్స్‌ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..

CLW Recruitment: ఐటిఐ అర్హత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండానే టెన్త్ మార్కులతో ఉద్యోగవకాశాలు
Indianrailways

Updated on: Sep 18, 2021 | 9:45 PM

CLW Recruitment 2021: నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిత్తరంజన్‌ లోని లోకో మోటివ్‌ వర్క్స్‌ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి clw.indianrailways.gov.in అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ధరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 3వ తేదీ 2021. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఉద్యోగ వివరాలు :

జాబ్ : ట్రేడ్‌ అప్రెంటిస్‌
ఉద్యోగంలోని : ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, రిఫ్రిజిరేషన్స్‌ అండ్ ఏసీ మెకానిక్స్‌, పెయింటర్‌
ఖాళీలు : 492
ఖాళీల వివరాలు
ట్రేడ్ పేరు ఖాళీల సంఖ్య
ఫిట్టర్ 200 పోస్టులు
టర్నర్ 20 పోస్టులు
మెషినిస్ట్ 56 పోస్టులు
వెల్డర్ (G&E) 88 పోస్టులు
ఎలక్ట్రీషియన్ 112 పోస్టులు
రిఫ్రిజిరేషన్స్‌ అండ్ ఏసీ మెకానిక్స్‌ 4 పోస్ట్లు
పెయింటర్‌ (జి) 12 పోస్ట్లు

అర్హత : అభ్యర్థి తప్పనిసరిగా మెట్రిక్యులేషన్/10 వ తరగతి, 10+2 పరీక్షా విధానంలో ఉత్తీర్ణులై ఉండాలి.. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత.
వయసు : 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెల‌కు రూ. 8,000 – 20,000/-
ఎంపిక విధానం: 10 వ తరగతి పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

Also Read: Gangavalli Kura: వయసుతో పాటు వచ్చే ఎముకల వ్యాధులను నివారించే అద్భుతమైన ఆకు కూర ‘గంగవెల్లి’..ఎక్కడైనా కనిపిస్తే వదలకండి..