CLAT 2022: తొలిసారిగా సంవత్సరానికి రెండు సార్లు కామన్ లా అడ్మిషన్ టెస్ట్.. దరఖాస్తు ఎక్కడ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..

నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం 2022 కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) తేదీలను ప్రకటించింది. CLAT 2022 మే 8న నిర్వహిస్తారు.

CLAT 2022: తొలిసారిగా సంవత్సరానికి రెండు సార్లు కామన్ లా అడ్మిషన్ టెస్ట్.. దరఖాస్తు ఎక్కడ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..
Clat 2022 Exam Dates

Updated on: Dec 28, 2021 | 9:23 AM

CLAT 2022: నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం 2022 కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) తేదీలను ప్రకటించింది. CLAT 2022 మే 8న నిర్వహిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు జనవరి 1, 2022 నుంచి ప్రారంభమవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ (UG). పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ప్రోగ్రామ్‌ల కోసం లా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. CLAT కోసం అప్లికేషన్ పోర్టల్ మార్చి 31, 2022 వరకు తెరిచి ఉంటుంది. CLAT దరఖాస్తు ఫారమ్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

రుసుము తగ్గింపు

CLAT UG కోసం, విద్యార్థులు అర్హత పరీక్షలో 45 పర్సంటైల్ లేదా దానికి సమానమైన స్కోర్ అదేవిధంగా CLAT PG కోసం 50 పర్సంటైల్ స్కోర్ చేయాలి. అయితే, రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు సడలింపు ఇస్తారు. కన్సార్టియం తొలిసారిగా 2022లో రెండు టెస్టులను షెడ్యూల్ చేసింది. క్లాట్ కౌన్సెలింగ్ ఫీజును రూ.50,000 నుంచి రూ.30,000కు తగ్గించింది. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఫీజు రూ.20,000.

ఒకే సంవత్సరంలో రెండుసార్లు క్లాట్ నిర్వహించడం ఇదే తొలిసారి. CLAT 2022 మే 8న, CLAT-2023 డిసెంబర్ 18, 2022న నిర్వహించబడుతుంది. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB అలాగే, LLM ప్రోగ్రామ్‌లను అందించే 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం CLAT నిర్వహిస్తున్నారు.

పరీక్షకు ఎవరు హాజరు కావచ్చంటే..

12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా బోర్డు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు UG-CLAT 2022 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే LLB పూర్తి చేసిన లేదా LLB ప్రోగ్రామ్ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు CLAT LLM కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష నమూనా

గరిష్ట మార్కులు – 150
CLAT 2021 పరీక్ష వ్యవధి – 120 నిమిషాలు
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు – ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 150 ప్రశ్నలు
నెగెటివ్ మార్కింగ్- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..