CISF Recruitment 2022: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 787 కానిస్టేబుల్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..

|

Nov 12, 2022 | 8:50 AM

పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 787 కానిస్టేబుల్‌/ట్రేడ్‌మెన్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల..

CISF Recruitment 2022: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 787 కానిస్టేబుల్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..
CISF Constable Recruitment 2022
Follow us on

పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 787 కానిస్టేబుల్‌/ట్రేడ్‌మెన్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. కుక్, కాబ్లర్, బార్బర్‌, వాషర్‌మెన్‌, స్వీపర్‌, పెయింటర్‌, మాసన్‌, ప్లంబర్‌, మాలి, వెల్డర్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, బార్బర్‌/బూట్‌మేకర్/కాబ్లర్/టైలర్/కుక్/మాసన్‌/మాలి/పెయింటర్‌/ప్లంబర్‌/వాషర్‌ మ్యాన్/వెల్డర్‌ విభాగాల్లో ఐటీఐ ట్రైన్డ్‌ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సంబంధిత కొలమానాల మేరకు శారీర దారుఢ్య పరిమాణాలు ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.