CISF Recruitment 2021: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది గుడ్‌న్యూసే.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేస్తోంది. అయితే కాంట్రాక్ట్ పద్దతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు.
ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.
కాగా, మొత్తం 2000 పోస్టులను భర్తీ చేస్తుండగా, అందులో ఎస్సై- 63, ఏఎస్సై- 187, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326 పోస్టులున్నాయి. ఇక ఎస్సై పోస్టుకు రూ.40 వేలు, ఏఎస్సై పోస్టుకు రూ.35 వేలు,హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుకు రూ.30 వేలు, కానిస్టేబుల్ జనరల్ పోస్టుకు రూ.25 వేలు చెల్లిస్తారు. ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయిన వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 50 ఏళ్లలోపు ఉండాలి. ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇవి చదవండి : 4G Network: మీ మొబైల్‌లో 4జీ నెట్ వర్క్ సరిగ్గా రావడం లేదా..? స్పీడు తగ్గిందా..? ఇలా చేస్తే స్పీడ్ పెంచుకోవచ్చు
Air travel: అదిరిపోయే బంపర్ ఆఫర్.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్