DCCB Recruitment: బ్యాంక్‌ జాబ్స్‌కి ప్రిపేర్‌ అవుతోన్న వారికి అలర్ట్‌.. డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం..

|

Nov 06, 2022 | 12:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు చెందిన సహకార బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్‌ విధానంలో స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

DCCB Recruitment: బ్యాంక్‌ జాబ్స్‌కి ప్రిపేర్‌ అవుతోన్న వారికి అలర్ట్‌.. డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం..
Dccb Chittoor Jobs
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు చెందిన సహకార బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్‌ విధానంలో స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-10-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920 జీతంగా చెల్లిస్తారు.

* ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు రూ.413, ఇతరులు రూ. 590 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 20-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..