JNU VC: జేఎన్‌యూ వీసీగా మరోసారి తెలుగు వారికి అవకాశం.. తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి.

JNU VC: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి వైస్‌ఛాన్సలర్‌గా తొలిసారి మహిళలను నియమించారు. జేఎన్‌యూ నూతన వీసీగా ప్రాఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడిని నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. జేఎన్‌యూ వీసీగా మ‌హిళ ప్రొఫెస‌ర్‌..

JNU VC: జేఎన్‌యూ వీసీగా మరోసారి తెలుగు వారికి అవకాశం.. తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి.

Updated on: Feb 07, 2022 | 12:51 PM

JNU VC: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి వైస్‌ఛాన్సలర్‌గా తొలిసారి మహిళలను నియమించారు. జేఎన్‌యూ నూతన వీసీగా ప్రాఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. జేఎన్‌యూ వీసీగా మ‌హిళ ప్రొఫెస‌ర్‌ను నియ‌మించ‌డం ఇదే తొలిసారి కావడం విశేషం. వీసీగా శాంతిశ్రీ పదవి కాలం ఐదేళ్లు ఉండనుంది. ఇదిలా ఉంటే జేఎన్‌యూకి తెలుగు వ్యక్తి వీసీగా వరుసగా రెండోసారి నియమితులు కావడం విశేషం.

శాంతిశ్రీ ప్రస్తుతం సావిత్రీబాయి పూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక శాంతిశ్రీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ డిగ్రీలను పొందారు. ఆమె 1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1993లో పూణె యూనివర్సిటీలో చేరారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జేఎన్‌యూ తాత్కాలిక వీసీగా ఎం జ‌గ‌దీశ్ కుమార్ బాధ్యత‌లు నిర్వర్తిస్తున్నారు. ఆయ‌న అయిదేళ్ల కాల‌ప‌రిమితి గ‌త ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలోనే అతడిని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఛైర్మన్‌గా నియమించారు. తెలంగాణకు చెందిన జగదీశ్‌ యూజీసీ ఛైర్మన్గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తిగా నిలిచారు.

Also Read: Booster Shot: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?

Car Loan: కార్‌ లోన్‌ కావాలంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..?

Petrol Diesel Price: స్థిరంగా చమురు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..