సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ అసోసియేట్ (30), ప్రాజెక్ట్ ఇంజనీర్ (250), ప్రాజెక్ట్ మేనేజర్ /ప్రోగ్రాం మేనేజర్ /ప్రోగ్రాం డెలివరీ మేనేజర్ /నాలెడ్జ్ పార్ట్ నర్ (50), సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్ (200) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 28, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..