CCI Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే..

|

May 19, 2022 | 4:53 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీలోని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్‌, ఎక్స్‌పర్ట్‌ (ఫోరెన్సిక్ ఆడిట్‌) పోస్టుల (Young Professionals Posts) భర్తీకి అర్హులైన..

CCI Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే..
Cci
Follow us on

Competition Commission of India Young Professionals Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీలోని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్‌, ఎక్స్‌పర్ట్‌ (ఫోరెన్సిక్ ఆడిట్‌) పోస్టుల (Young Professionals Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 31

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టులు: 30
  • ఎక్స్‌పర్ట్‌ (ఫోరెన్సిక్ ఆడిట్‌) పోస్టులు: 1

విభాగాలు: లా, ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ అనాలసిస్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.60,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: లా డిగ్రీ, ఎకనామిక్స్‌లో పీజీ డిగ్రీ, ఎమ్‌కాం, సీఏ/సీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: డిప్యూటీ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) , 8వ అంతస్తు, కిద్వాయ్‌ నగర్, న్యూఢిల్లీ – 110023.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 27, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.