Fake news alert: సీబీఎస్సీ12వ తరగతి టర్మ్‌-I ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు! జోరందుకున్న నకిలీ వార్తలు..

|

Mar 12, 2022 | 11:40 AM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి టర్మ్-1 ఫలితాలపై శుక్రవారం (మార్చి 11) సీబీఎస్సీ కీలక ప్రకటన వెలువరించింది. 12వ తరగతికి సంబంధించిన టర్మ్‌ 1 ఫలితాల ప్రకటన..

Fake news alert: సీబీఎస్సీ12వ తరగతి టర్మ్‌-I ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు! జోరందుకున్న నకిలీ వార్తలు..
Cbse
Follow us on

CBSE Term 1 Result 2021-22 Not released yet: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి టర్మ్-1 ఫలితాలపై శుక్రవారం (మార్చి 11) సీబీఎస్సీ కీలక ప్రకటన వెలువరించింది. 12వ తరగతికి సంబంధించిన టర్మ్‌ 1 ఫలితాల ప్రకటన తేదీని ఇంకా విడుదల చేయలేదని, ఫలితాల గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ నకిలీవని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ టర్మ్-1 ఫలితాలు మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఫలితాల తేదీ గురించిన సమాచారం సీబీఎస్సీ ఇంతవరకు ప్రకటించలేదు. సదరు వార్తలన్నీ నకిలీవని, విద్యార్ధులు ఇలాంటి సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంటు బోర్డు తన అధికారిక ట్విటర్‌ ద్వారా ప్రకటన విడుదల చేసింది. కాగా సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్-1 పరీక్షలు గత ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11, 2021 మధ్య జరిగాయి. ఇక 12వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు జరిగాయి. టర్మ్‌ I పరీక్షల ఫలితాల కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. వివిధ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాంలలో సీబీఎస్సీ ఫలితాల తేదీలని ప్రకటించినట్లు పేర్కొంటూ నకిలీ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై సీబీఎస్సీ క్లారటీ ఇస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇక 12 తరగతికి చెందిన టర్మ్‌ -I ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, అప్‌డేట్స్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.cbse.gov.in/ను తరచూగా చెక్ చూసుకోవాలని విద్యార్ధులకు సూచించింది.

Also Read:

ESIC SSO Recruitment 2022: ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? నెలకు లక్షకుపైగా జీతంతో ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు..రేపే ఆఖరు..