CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలు విడుదల.. జూన్‌ 20న ఫలితాలు

|

May 02, 2021 | 11:37 AM

CBSE Eaxm Result: కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్‌ఈ .. విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ మేరకు

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలు విడుదల.. జూన్‌ 20న ఫలితాలు
CBSE 10th Class result 2021
Follow us on

CBSE Eaxm Result: కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్‌ఈ .. విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి వాటిని విడుదల చేసింది. జూన్‌ 20వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు ఉన్నారు.

అయితే గతంలో మాదిరిగానే అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌)కు 20 మార్కులు ఉంటాయి. వాటిని జూన్‌ 11వ తేదీ లోపు బోర్డుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పంపాలి. మిగిలిన 80 మార్కులను పాఠశాలలో ఏడాది పొడవునా వివిధ పరీక్షల్లో విద్యార్థి సాధించిన ఫలితాల ఆధారంగా కేటాయించనున్నారు. అయితే పిరియాడిక్‌, యూనిట్‌ పరీక్షలకు 10, ఆరు నెలల, మిడ్‌టర్న్‌ పరక్షలకు 30, ఫ్రీ బోర్డు పరీక్షలకు 40 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఈ మార్కులు కేటాయించడానికి ప్రతి పాఠశాలలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేయాలి. దానికి ప్రిన్సిపల్‌ నేతృత్వం వహిస్తారు. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మరో ఇద్దరిని మరో పాఠశాల నుంచి నియమిస్తారు. అయితే ఆయా రికార్డులను సీబీఎస్ఈ బృందాలు కూడా తనిఖీ చేస్తాయి. ఒక వేళ పాఠశాల నిర్వహించిన పరీక్షలకు హాజరు కాని వారికి అఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా టెలిఫోన్‌లో ప్రశ్నలు అడిగి ప్రతిభను అంచనా వేస్తారు. అయితే మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మార్కులు కేటాయించినట్లయితే జరిమానా లేదా పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని సీబీఎస్‌ఈ హెచ్చరించింది.

ఫలితాలు ఇలా..

మే 5: నాటికి పాఠశాలలో కమిటీ ఏర్పాటు
మే 25: కమిటీచే ఫలితాల ఖరారు
జూన్‌ 5: సీబీఎస్‌ఈకి మార్కుల వివరాలు పంపాలి
జూన్‌ 20: సీబీఎస్‌ఈచే ఫలితాలు వెల్లడి

ఇవీ కూడా చదవండి:

DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 30 చివరి తేదీ

ICAI CA Intermediate: ఐసీఏఐ కీలక నిర్ణయం.. సీఏ, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే..!