CBSE Class 10th Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫలితాలు విడుదలవుతున్నాయంటూ వార్తలు వెలువడుతుండటంతో సీబీఐఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఫలితాలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతాయని వెల్లడించింది. ఈ ఫలితాల కోసం సీబీఎస్‌ఈ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే విద్యార్థులు cbse.gov.in, cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల మార్క్ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు. అయితే వాస్తవానికి ఈ ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
CBSE Class X Results to be announced today at 12 Noon.#CBSEResults #CBSE pic.twitter.com/LJU1MUaB4Z
— CBSE HQ (@cbseindia29) August 3, 2021