CBSE: విద్యార్థులకు అలర్ట్‌… సీబీఎస్‌ఈ పరీక్షల తేదీ వార్తలపై స్పందించిన బోర్డ్‌. అవన్నీ వట్టి పుకార్లే అంటూ..

|

Oct 18, 2021 | 5:56 PM

CBSE: సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న..

CBSE: విద్యార్థులకు అలర్ట్‌... సీబీఎస్‌ఈ పరీక్షల తేదీ వార్తలపై స్పందించిన బోర్డ్‌. అవన్నీ వట్టి పుకార్లే అంటూ..
Cbse Exam Date
Follow us on

CBSE Date sheet 2021: సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఫేక్‌ వార్తలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న పోస్టుల ఆధారంగా నవంబర్‌ 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై సీబీఎస్‌ఈ బోర్డ్‌ అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సీబీఎస్‌ఈ అధికార ప్రతినిధి రామశర్మ స్పష్టం చేశారు. ఈ విషయంపై సీబీఎస్‌ఈ ట్వీట్ చేస్తూ.. ‘సీబీఎస్‌ఈ టర్మ్‌ 1 పరీక్షల షెడ్యూల్ ఇదేనని కొన్ని తేదీలు వైరల్‌ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విద్యార్థులను గందరగోళానికి గురి చేయడానికే ఇలాంటి ఫేక్‌ వార్తలను సృష్టిస్తున్నారు.

సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు’ అంటూ పేర్కొన్నారు. పరీక్షల తేదీలకు సంబంధించిన సమాచారం కోసం సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌, అధికారిక సోషల్‌ మీడియా సైట్లను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సీబీఎస్‌ఈ ఈ ఏడాది టర్మ్‌ 1, టర్మ్‌ 2 పేరుతో రెండు పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ ఈ పరీక్షలను 90 నిమిషాల నిడివితో కూడిన ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షను నిర్వహించనుంది.

Also Read: Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!

Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా? పోస్టాఫీస్-ఎస్బీఐ రెండిటిలో ఏది బెటర్? తెలుసుకోండి!

India vs Pakistan: ‘సైనికుల త్యాగాలను దాయాదుల క్రికెట్‌తో పోల్చడం సరికాదు.. ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ మాత్రమే’