Capgemini Hiring Drive: కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ రంగాలలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంలో ఆయా రంగాలలో మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. అయితే ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఫ్రెషర్స్ కోసం హైరింగ్ డ్రైవ్.. రిజిస్ట్రేషన్ ప్రఖ్యాత ఐటి కంపెనీ అయిన క్యాప్‌జెమిని దేశవ్యాప్తంగా ఐటి ఫ్రెషర్‌లకు ఉద్యోగాలు అందిస్తుంది. BE, B.Tech, ME, M.Tech, MBA, MCA లేదా ఏదైనా ఇతర డిగ్రీ (Capgemini Pooled Campus Drive) పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది భారత్ లో 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని ప్రకటించిన సంస్థ.. 2020 తో పోలిస్తే… ఇప్పుడు ఐటీ నియామకాలు 25 శాతం అధికంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకాలను చేపడతామని ఇటీవల ప్రకటించింది సంస్థ.
క్యాప్‌జెమిని, గ్లోబల్ లీడర్ కంపెనీల భాగస్వాములను చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింతగా నిర్వహించనుంది. దాదాపు 50 దేశాలలో 290,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భారతదేశంలోని క్యాప్ జెమినిలో 13 ప్రాంతాల్లో 150,000 మంది ఉన్నారు. ఇక ఎంఎన్‌సీ ఫూల్డ్ క్యాంపస్ డ్రైవ్ కోసం 2021 బ్యాచ్ ఇంజనీరింగ్ మరియు ఎంసీఏ ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 15. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహించనుంది.
► 2021, 2022లో పట్టభద్రులైన అభ్యర్థులు అర్హులు. ఎంసీఏ, బీఈ/బీటెక్. ఎంఈ/ ఎంటెక్ విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉండాలి.
► BE / BTech లో 50% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ నియామకానికి అవకాశం పొందుతారు.
► డిప్లొమా తర్వాత డిగ్రీ ఎంచుకునే అభ్యర్థికి డిప్లొమా మరియు డిగ్రీ మధ్య ఎలాంటి అంతరాలు ఉండకూడదు.
► హాజరయ్యే సమయంలో అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్ ఉండకూడదు
► పరీక్ష అంచనా/ ఎంపిక ప్రక్రియ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఆహ్వానించబడతారు.
► పరీక్ష నుండి ఇంటర్వ్యూ వరకు మొత్తం ఎంపిక ప్రక్రియ వర్చువల్ మోడ్‌లో జరుగుతుంది.
► ఆన్‌లైన్‌లో నిర్వహించే ఎంపిక ప్రక్రియకు హాజరు కావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే బాధ్యత అభ్యర్థులపై ఉంటుంది.
► క్యాప్‌జెమినిస్ పూల్డ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా నియామకం జరుగుతుంది. దీని కోసం, 2021 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వబడుతుంది.
► ఇక తాజా నియామకాల్లో..కొత్తవారితో పాటు.. అనుభవం ఉన్న అభ్యర్ధులను 50 శాతం చొప్పున తీసుకోనున్నారు.
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు 8 నుంచి 10 వారాల పాటు శిక్షణ ఉంటుంది.
► దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి