స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌బీఐ, ఈఏబీ, ఇతర పీఎస్‌బీల్లో రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31 లోపు ఎస్భీఐ కేరీర్స్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దాదాపు 868 పోస్టులను ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. అభ్యర్థులు దిగువ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్న అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, విద్యార్హత మరియు ఇతర వివరాలను తనిఖీ చేయవచ్చు.
దరఖాస్తుదారులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.