BTech Classes: రేపట్నుంచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. బీటెక్‌లో కోర్సులు, సిలబస్‌ నవీకరణకు సంబంధించి జేఎన్‌టీయూ రెగ్యులేషన్‌-2025ను జేఎన్టీయూ ఇటీవల జరిపిన సమావేశంలో అధికారులు ఆమోద ముద్ర వేశారు. అన్ని యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి సిలబస్‌లో..

BTech Classes: రేపట్నుంచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం..
Engineering Students

Updated on: Aug 10, 2025 | 10:39 PM

హైదరాబాద్‌, ఆగస్టు 10: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. బీటెక్‌లో కోర్సులు, సిలబస్‌ నవీకరణకు సంబంధించి జేఎన్‌టీయూ రెగ్యులేషన్‌-2025ను జేఎన్టీయూ ఇటీవల జరిపిన సమావేశంలో అధికారులు ఆమోద ముద్ర వేశారు. అన్ని యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి సిలబస్‌లో మార్పులు, కోర్సు అమరిక (స్ట్రక్చర్‌) ముసాయిదాపై ఇందులో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి సూచనలు స్వీకరించి, సిద్ధం చేసిన తుది నివేదికను అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం సమావేశంలో సమర్పించారు.

ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 11వ తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌టైం పీహెచ్‌డీ కోర్సులకు సెప్టెంబరు 12వ తేదీ నుంచి 14 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 1200 మంది ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారు.

సీశాబ్‌ 2025 తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి..

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు తదితర విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఈ మేరకు సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు (సీశాబ్‌) సీట్లు కేటాయించింది. జోసా కౌన్సెలింగ్‌ తర్వాత దాదాపు 13,727 సీట్లు మిగిలిపోయాయి. అందులో ఎన్‌ఐటీల్లో 4,500, ట్రిపుల్‌ ఐటీల్లో 3 వేల వరకు సీట్లు ఉన్నాయి. మిగిలినవి స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ (స్పా), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు సీశాబ్‌ 3 విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. అయితే తాజాగా నిర్వహించిన తొలి విడతలో అన్ని సీట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ కోటాలో 1,595 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,515 మందికి సీట్లు కేటాయించినట్లు సీశాబ్‌ ఛైర్మన్ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వర్‌రావు ఓ ప్రటకనలో తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.