BIRAC Recruitment: బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(BIRAC) పలు ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ-యువ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి ఫెలోషిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
* బైరాక్స్ ఇన్నోవేషన్ ఫెలోస్ (పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్‌డీ)లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.
* హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజెస్, డ్రగ్స్, డ్రగ్ ఫార్ములేషన్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో మాస్టర్స్/పీహెచ్‌డీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
* ఎంపికైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ నెలకి రూ.30,000, పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్‌కి నెలకి రూ.50,000 స్టైఫండ్ అందజేస్తారు.
* ఈ-యువ ఫెలోస్ (అండర్ గ్రాడ్యుయేట్స్) విభాగంలో మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7500 స్టైఫండ్‌గా, రీసెర్చ్ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 2,50,000 చెల్లిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: దొంగతనం నెపం ఒప్పుకోవాలని.. విచక్షణారహితంగా కొట్టి.. ఆపై
Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు