Bill Gates: ‘ఉద్యోగాలకు AI గండం గ్యారెంటీ.. కానీ ఆ 3 రంగాలు ఫుల్ సేఫ్‌’.. కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ వ్యాఖ్యలు

|

Mar 28, 2025 | 6:55 AM

కృత్రిమ మేధస్సుతో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు భారీగా కోల్పోవల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర ఆందోళ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ పనితనం ఇప్పుడు అందరికీ తమ ఉద్యోగాలు ఉంటయో.. ఊడతాయోనన్న డైలమాలో పడేసింది. దీనిపై ప్రపంచ కుభేరుడు బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఏమన్నారంటే..

Bill Gates: ఉద్యోగాలకు AI గండం గ్యారెంటీ.. కానీ ఆ 3 రంగాలు ఫుల్ సేఫ్‌.. కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
Bill Gates
Follow us on

కృత్రిమ మేధస్సులో ఓపెన్ ఏఐ చాట్‌ జీపీటీ పెను సంచనలం సృష్టించిందనే చెప్పాలి. దీనిని 2022లో ప్రారంభించిన నాటి నుంచి థింకింగ్‌, పనులు చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. జెమిని, కోపైలట్, డీప్‌సీక్ వంటి ఇతర AI చాట్‌బాట్‌లు ఇప్పటికీ వర్కింగ్‌ టూల్స్‌గా ఉపయోగిపడతున్నాయి. ఏఐ పనితనం ఇప్పుడు అందరికీ తమ ఉద్యోగాలు ఉంటయో.. ఊడతాయోనన్న డైలమాలో పడేసింది. చాలా వరకు నిపుణులు చేసే పనులన్నీ ఏఐ టూల్స్‌ చేసేయడమే ఇందుకు కారణం. గత నెలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చాలా విషయాల్లో మనుషుల స్థానాన్ని AI భర్తీ చేస్తుందని అనడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలన్నీ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ (69) పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటంటే..

NVIDIA జెన్సెన్ హువాంగ్, OpenAI సామ్ ఆల్ట్‌మాన్, సేల్స్‌ఫోర్స్ CEO మార్క్ బెనియోఫ్ వంటి పలు నివేదికలు, నిపుణులు సమీప భవిష్యత్తులో కోడింగ్‌ చేసే ఉద్యోగులు తొలుత తమ ఉపాధిని కోల్పోయే మొదటి జాబితాలో ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే మూడు ముఖ్య రంగాల్లోని నిపుణుల స్థానాన్ని AI ఎప్పటికీ భర్తీ చేయలేదని గేట్స్ అంటున్నారు. కోడ్‌ను రూపొందించడంలో, కొన్ని ప్రోగ్రామింగ్ టాస్క్‌లను ఏఐ సమర్ధవంతంగా చేస్తుంది. కానీ కచ్చితత్వం, లాజిక్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఏఐకి లేదు. క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఈ లక్షణాలన్నీ కావాలి. డీబగ్గింగ్, ఏఐను మెరుగుపర్చడంలో ప్రోగ్రామర్స్ కీలకం. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ కోడ్ రాయడంలో ఉపయోగపడతాయి. అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామర్స్ అవసరం. వీరి స్థానాన్ని ఏఐ భర్తీ చేయలేదు.

అలాగే జీవశాస్త్రవేత్తలను భర్తీ చేయడంలో AIకి అంతసీన్‌ లేదని గేట్స్‌ తేల్చి పారేశారు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిని చేయడానికి ఉపయోగకరమైన సాధనంగా ఇది పనికొస్తుందని అన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలకు అవసరమైన సృజనాత్మకత దీనికి లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్ రంగంలో కూడా AI ఇప్పటికీ పూర్తిగా ఆటోమేటెడ్ చేయలేకపోతుంది. కాబట్టి AI ఈ రంగంలో నిపుణుల స్థానాన్ని భర్తీ చేయలేదని గేట్స్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

జనరేటివ్ AI రోజురోజుకూ మరింత శక్తివంతమవుతుండటంతో ఉద్యోగ నియామకాల్లో, ప్రతిభ కలిగిన నిపుణుల విషయంలో ఈ సాంకేతికత ఎలా పని చేస్తుందనే దానిపై భారీ ప్రభావాన్ని చూపుతుందని, కొన్ని రంగాలలో AI మానవ మేధస్సును అధిగమిస్తుందని

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.