Medical Seats: భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయంటే..?

|

Dec 07, 2024 | 1:00 PM

దేశ వ్యాప్తంగా వైద్య విద్యావకాశాలు మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత పదేళ్లలో 130శాతం మెడికల్ సీట్లు పెరిగాయి.

Medical Seats: భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయంటే..?
Medical Education
Follow us on

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వైద్య విద్యలో పెద్ద మార్పు వచ్చింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2014కి ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 2014కి ముందు 51,348 సీట్లు ఉంటే ఇప్పుడు 1,18,137కి పెరిగింది. ఇది 130 శాతం పెరుగుదల. ఇప్పుడు 2024లో మెడికల్ కాలేజీల సంఖ్య 780కి పెరిగింది. ఇది 102 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.

కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2013–14లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 65 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్‌లోనూ వైద్య విద్య విస్తరించింది. 2013-14లో 10 కాలేజీలు, 1,750 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 43 కాలేజీలు, 6,475 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాలేజీల సంఖ్య ఐదు కాలేజీల (600 సీట్లు) నుంచి 16 కాలేజీలకు (2,455 సీట్లు) పెరిగింది. ఢిల్లీలో కాలేజీల సంఖ్య 7 నుంచి 10కి పెరగ్గా, సీట్ల సంఖ్య 900 నుంచి 1,497కి పెరిగింది.

మధ్యప్రదేశ్‌లో కాలేజీల సంఖ్య 12 (1,700 సీట్లు) నుంచి 31 కాలేజీలకు (5,200 సీట్లు) పెరిగింది. ఈ విధంగా, దేశంలో వైద్య విద్యకు అవకాశాలు గణనీయంగా పెరిగాయి. మహారాష్ట్రలో ఎంబీబీఎస్ సీట్లు 5,590 నుంచి 11,845కి పెరిగాయి. తమిళనాడులో 5,835 సీట్లు పెరగ్గా ఇప్పుడు మొత్తం సీట్ల సంఖ్య 12,050కి చేరింది. మహారాష్ట్రలో 44 నుంచి 80 మెడికల్ కాలేజీలు, ఉత్తరప్రదేశ్‌లో 30 నుంచి 86 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 3,749 సీట్లు ఉండగా, ఇప్పుడు 12,425కి పెరిగింది. తెలంగాణలో ఇంతకుముందు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. ఇప్పుడు 9,040 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం అత్యధిక వైద్య కళాశాలలు ఉన్నాయి. 2013-14లో 46 మెడికల్ కాలేజీలు ఉండగా ఇప్పుడు 73కి పెరిగాయి.

ఇక, గోవా, చండీగఢ్‌లలో ఇప్పటికే ఒక్కో మెడికల్ కాలేజీ ఉంది. ఈ రెండు చోట్లా కాలేజీల సంఖ్య పెరగకపోగా, ఎంబీబీఎస్ సీట్లు స్వల్పంగా పెరిగాయి. అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా, నగర్ హవేలీ, మిజోరాం, నాగాలాండ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ కనీసం ఒక వైద్య కళాశాల ఉంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో మరో మూడు కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య ఏడు నుండి 10కి చేరుకుంది. MBBS సీట్లు 900 నుండి 1,497కి పెరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ప్రకటించారు.

మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..