BHEL: నిరుద్యోగులను మోసం చేస్తూ ఇటీవల నకిలీ వెబ్‌సైట్లు పెరిగిపోతున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. నిరుద్యోగులు కూడా అసలు వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్‌కు మధ్య తేడా లేకపోవడంతో మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ నకిలీ వెబ్‌సైట్ హల్చల్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అభ్యర్థులను అలర్ట్ చేసే క్రమంలో ట్విట్టర్ వేదికగా పబ్లిక్ నోటిస్‌ను పోస్ట్ చేశారు.
ఫేక్ వెబ్‌సైట్ అలర్ట్ పేరుతో పోస్ట్ చేసిన బీహెచ్‌ఈఎల్.. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఓ నకిలీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. www.bhel.com, https://careers.bhel.in/ వెబ్‌సైట్‌లలో వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మిగతా వాటిలో ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా వాటి జోలికి వెళ్లకండి. ఒకవేళ ఏదైనా సమాచారం అవసరం ఉంటే వెంటనే బీహెచ్‌ఈఎల్ అధికారులను సంప్రదించండి’ అంటూ పేర్కొన్నారు.
ఇక ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్‌లపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చూశారుగా మీరు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అది అసలైన వెబ్‌సైటా నకిలీదా అన్న దానిపై స్పష్టత తీసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. మరీ ముఖ్యంగా పరీక్ష ఫీజులాంటివి చెల్లించే ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Notice of Caution pic.twitter.com/sVGo4yySUr
— Bharat Heavy Electricals Limited (@BHEL_India) November 5, 2021
Also Read: Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మైనర్ సర్జరీ.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గాయం..
Diwali Crackers: 400 ఏళ్ల క్రితం టపాకాయలు ఎలా పేల్చేవారో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే చూసేయండి..