BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 247 ఖాళీలు ఉన్నాయి.
* వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ 67, ట్రైనీ ఇంజినీర్ 169, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) 11 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు రూ. 500, ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200 ఫీజు చెల్చించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
* దరఖాస్తుల స్వీకరణకు 04-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
CM KCR: కేంద్రం బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. బుల్లెట్ల లాంటి పదాలతో విమర్శలు
Budget 2022: కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో పోస్టాఫీసుల అనుసంధానం.. ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి అవకాశం..