BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుల (Accountant, Lower Division Clerk Posts) భర్తీకి..

BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..
Becil Jobs

Updated on: Mar 05, 2022 | 6:01 PM

BECIL Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుల (Accountant, Lower Division Clerk Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు హైదరాబాద్‌, ముంబాయి, పాట్నా, జయపురలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: అకౌంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.18,824ల నుంచి రూ.22,464ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీకాంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.750
  • ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులకు: రూ. 450

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Good News: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. JIPMERలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..