BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 418 కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) విడుదల చేసిన 418 లోడర్, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు దరఖాస్తు చేస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. ఇప్పటి వరకు..

BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 418 కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..
Becil Jobs

Updated on: Aug 18, 2022 | 2:42 PM

BECIL Loader and Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) విడుదల చేసిన 418 లోడర్, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు దరఖాస్తు చేస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆగస్టు 19, 2022వ తేదీ ముగిసేలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే కంప్యూటర్‌ నైపుణ్యాలతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులు రూ.750లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.450లు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.14,378ల నుంచి రూ.20,956ల వరకు జీతం చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • లోడర్/అన్‌స్కిల్డ్‌ పోస్టులు: 260
  • సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/స్కిల్డ్ పోస్టులు: 31
  • MTS/ హ్యాండీమ్యాన్/లోడర్/అన్‌స్కిల్డ్‌ పోస్టులు: 96
  • సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్కిల్డ్ పోస్టులు: 11
  • సూపర్‌వైజర్ కమ్ DEO/సెమీ-స్కిల్డ్ పోస్టులు: 10
  • సీనియర్ సూపర్‌వైజర్ పోస్టులు: 1
  • కార్గో అసిస్టెంట్ పోస్టులు: 2
  • ఆఫీస్ అటెండెంట్ పోస్టులు: 2
  • హౌస్-కీపింగ్ పోస్టులు:3
  • హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్ పోస్టులు: 1
  • ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.