BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Feb 19, 2022 | 5:46 PM

BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 96 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Becil Jobs
Follow us on

BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 96 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 96 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రేడియోగ్రాఫర్‌ (22), మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌ (51), పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌ (8), ఫెబోటమిస్ట్‌ (1), ల్యాబ్‌ అటెండెంట్‌ (14) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ రేడియాలజి, ఎమ్మెల్టీ, లైఫ్‌సైన్స్‌, మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నాలజిస్ట్‌, ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 28ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇలా దరఖాస్తు చేసుకోండి:

 

 

  1.  ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ www.becil.comలోకి వెళ్లాలి.
  2.  అనంతరం ‘కెరీర్స్‌ సెక్షన్‌’లోకి వెళ్లి ‘రిజిస్ట్రేషన్‌ ఫామ్‌’ క్లిక్‌ చేయాలి.
  3.  సంబంధిత వివరాలు అందించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  4.  తర్వాత ఫోటో, సిగ్నేచర్‌, బర్త్‌ సర్టిఫికేట్‌/టెన్త్‌ సర్టిఫికేట్‌, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ అప్‌లోడ్‌ చేయాలి.
  5.  చివరిగా అప్లికేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
  6.  భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read: Tamarind Seed: ఒక రోజులో చేసే పని ఒక గంటలోనే.. చింతపండు నుంచి గింజలను వేరు చేసే మిషన్..

Jaggareddy: అదిగో ఇదిగో అన్నారు.. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు.. డెడ్‌లైన్‌ ముగిసే సరికి వెనక్కి తగ్గాడు.. జగ్గారెడ్డి రివర్స్ గేర్!

Survey: దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..