BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌లో పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 82 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 57, టెక్నీషియన్ అప్రెంటిస్ 25 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్, సీఎస్ఈ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఈఈఈ, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఏదోఒక డిగ్రీ, డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 19-01-2022న ప్రారంభం కాగా, 27-01-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ICC Women World Cup: ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్.. భారత వన్డే కెప్టెన్ సమాధానం ఏంటంటే?
Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్.. కీలక దశకు బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్!