RGUKT Admissions 2025: రేపే బాసర ఆర్జీయూకేటీ IIIT అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ అర్హతతో నేరుగా బీటెక్ ప్రవేశాలు

2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ బాసర ఆర్జీయూకేటీ బుధవారం (మే 28) విడుదల చేయనుంది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్‌ మే 26న ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను యూవర్సిటీ..

RGUKT Admissions 2025: రేపే బాసర ఆర్జీయూకేటీ IIIT అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ అర్హతతో నేరుగా బీటెక్ ప్రవేశాలు
Basara RGUKT Admissions

Updated on: May 27, 2025 | 4:11 PM

హైదరాబాద్‌, మే 27: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (బాసర ఆర్జీయూకేటీ) 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ బుధవారం (మే 28) విడుదల చేయనుంది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్‌ మే 26న ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను యూవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ మేరకు బాసర ఆర్జీయూకేటీలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో ( B.Tech ) ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు.

ఇక ప్రవేశాల షెడ్యూల్ కూడా త్వరలోనే వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. బాసర క్యాంపస్‌లో వివిధ బ్రాంచీలో దాదాపు 1500కు పైగా సీట్లు అందుబాటులో ఉంటాయి. అధికారికంగా విడుదలయ్యే నోటిఫికేషన్ లో వివరాలను ప్రకటిస్తారు. ఇతర తాజా సమాచారం కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే నాలుగు క్యాంపస్‌లలో ఆరేళ్ల ఐఐఐటీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది.

ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2025 అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతోపాటు మాస్టర్‌ ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్స్‌లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్‌ కీ పై మే 29 వరకు అభ్యంతరాలకు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ఈసారి జేఎన్‌టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీసెట్‌-2025 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా.. మే21 నుంచి ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు మొదలై మే 26తో పరీక్షలు ముగిశాయి. ఇక షెడ్యూల్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రాథమిక కీ మే 28న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.