BARC Recruitment: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో భారీగా ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..
BARC Recruitment 2022: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బార్క్ పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో(తారాపూర్, కల్పకం)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
BARC Recruitment 2022: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బార్క్ పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో(తారాపూర్, కల్పకం)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 266 ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 266 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి1 (71), స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి2 (189), సైంటిఫిక్ అసిస్టెంట్ బి(సేఫ్టీ) (01),టెక్నీషియన్ బి(లైబ్రరీ సైన్స్) (01), టెక్నీషియన్ బి(రిగ్గర్) (04) ఖాళీలు ఉన్నాయి.
* స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరీ-1 పోస్టులకుగాను కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థలు వయసు 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
* స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి–2 ఖాళీలకుగాను ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్ ఆపరేటర్ ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు కనీసం 60శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18–22 ఏళ్ల మధ్య ఉండాలి.
* సైంటిఫిక్ అసిస్టెంట్ బి(సేఫ్టీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* టెక్నీషియన్–బి(లైబ్రరీ సైన్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* టెక్నీషియన్–బి(రిగ్గర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. రిగ్గర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైనవారికి పోస్టుల ఆధారంగా నెలకు రూ. 10,500 నుంచి రూ. 21,700 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 30-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* దరఖాస్తు చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Gold Silver Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర!
PM Modi-Sharad Pawar: గడ్కరీతో విందు.. ప్రధాని మోడీతో భేటీ.. మహా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..
Hyderabad: రసవత్తరంగా కిడ్స్ అథ్లెటిక్స్ పోటీలు.. రన్నింగ్ రేసులో సత్తా చాటిన బుడతడు..