పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 314 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏడాదిపాటు ఉండే ఈ ట్రైనింగ్ పిరియడ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 23, 2023లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐతే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ.150లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన వారు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాష్ట్రాల వారీగా అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.9000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.