Bank Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం పొందే ఛాన్స్‌.. ఎంపికైతే లక్షల్లో జీతం

|

Nov 03, 2024 | 8:30 AM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా బ్యాంకు కొలువు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. భారీగా ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..

Bank Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం పొందే ఛాన్స్‌.. ఎంపికైతే లక్షల్లో జీతం
Bank Of Baroda
Follow us on

ఉద్యోగాన్వేషనలో ఉన్న వారికి గుడ్‌న్యూస్‌.. ఆకర్షణీయ జీతంతో బ్యాంకు ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లోని పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 592 బ్యాంకు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తారు. ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 352
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 56
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 24
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 123
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 37

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధాంగా సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. ఆయా పోస్టులకు వయోపరిమితి 22 నుంచి 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 19, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చొప్పున, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్ చేసి.. ఎంపిక చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరిచిన వారిని, వారి విద్యార్హతలు, అనుభవం ఇతరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.