Bank of Baroda Recruitment 2022: రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఉద్యోగాలు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పోస్టులకు ఈ అర్హతలుంటే చాలు..

|

Jun 19, 2022 | 10:51 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్‌ పోస్టుల (Data Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Bank of Baroda Recruitment 2022: రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఉద్యోగాలు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పోస్టులకు ఈ అర్హతలుంటే చాలు..
Bank Of Baroda
Follow us on

Bank of Baroda Data Scientist Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్‌ పోస్టుల (Data Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డేటా సైంటిస్ట్‌, డేటా ఇంజినీర్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌-డేటా సైంటిస్ట్‌ పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-డేటా సైంటిస్ట్‌ పోస్టులు: 6
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్-డేటా ఇంజినీర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-డేటా ఇంజినీర్ పోస్టులు: 4

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎంఈ/ఐటీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.