Bank Of Baroda Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి.
* ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు అప్లై చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతంర కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత కరెంట్ ఆపర్చునిటిస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* అభ్యర్థులు అర్హులైన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై అప్లై నో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* చివరిగా అవసరమైన వివరాలను అందించి సబ్‌మిట్ నొక్కాలి.
Also Read: Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..
Modi in UP Elections: ఉగ్ర మూలాలు ఏ రూపంలో ఉన్న శిక్ష తప్పదు.. హర్దోయ్ ర్యాలీలో ప్రధాని మోడీ