Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. డిగ్రీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Dec 22, 2021 | 2:23 PM

Bank Of Baroda Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంకులో మొత్తం 07 ఖాళీలను..

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. డిగ్రీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Follow us on

Bank Of Baroda Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంకులో మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌)–01, బిజినెస్‌ హెడ్‌(కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌)–01, బిజినెస్‌ హెడ్‌(లోన్‌ అగైనెస్ట్‌ ప్రాపర్టీ అండ్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌)–01, వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ)–04 ఖాళీలు ఉన్నాయి.

* హెడ్, బిజినెస్‌ హెడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 36 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

* వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం, అకడమిక్ అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 23-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Year Ender 2021: ప్రపంచ క్రికెట్‌లో మరుపురాని క్షణాలు.. వివాదాలే కాదు.. అరుదైన రికార్డులూ ఈ ఏడాది సొంతం..!

Viral Video: ఓర్నీ! ఇదేం లవ్ ప్రపోజ్ మావా.. ప్రియురాలికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడుగా.. వీడియో వైరల్!

83 Movie: 6 నెలలు.. రోజుకు 4 గంటలు.. కపిల్ దేవ్‌లా రణవీర్‌ సింగ్ ఎలా మారాడంటే?