Ayush Recruitment: ఆయుష్ మంత్రిత్వ శాఖ సీసీఆర్‌ఏఎస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 70 వేలకు పైగా జీతం..
Ayush Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు...
Ayush Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆయుర్వేద స్పెషలిస్టులు (40), ఆయుర్వేద జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (110), ఆయుర్వేద ఫార్మసిస్టులు (150), పంచకర్మ థెరపిస్టులు (10) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18000 నుంచి రూ. 75,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 26-04-2022న మొదలై 05-05-2022తో ముగియ నుంది. రాత పరీక్షను 15-05-2022న నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప చిప్స్.. బయటికి తీసి రుచి చూడగా దెబ్బకు షాక్..
IPL 2022: మెగా టోర్నీలో తళుక్కుమంటోన్న మిస్టరీ గర్ల్స్.. ఓవర్‌నైట్‌లోనే బోలెడంత క్రేజ్..