Jobs: ఉద్యోగులకు పండగే.. ఈ ఏడాది జీతాలు ఎంతలా పెరగనున్నాయో తెలుసా.?

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్‌ చేపట్టిన ‘టోటల్‌ రెమ్యునరేషన్‌ సర్వే’ (టీఆర్‌ఎస్‌)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈసారి ఉద్యోగుల జీవితాలు సగటు 10 శాతం పెరుగవచ్చని సర్వేలో తేలింది. ఇదిలా ఉంటే గతేడాది దేశంలో ఉద్యోగుల సగటున 9.5 శాతం ఉన్నట్లు మెర్సర్స్‌ తమ తాజా రిపోర్టులో పేర్కొంది...

Jobs: ఉద్యోగులకు పండగే.. ఈ ఏడాది జీతాలు ఎంతలా పెరగనున్నాయో తెలుసా.?
Jobs

Updated on: Feb 28, 2024 | 3:02 PM

మీరు ఉద్యోగం చేస్తుంటారా.? అయితే మీకు ఓ శుభవార్త. ఈ ఏడాది జీతాలను భారీగా పెరగనున్నట్లు పలు గణంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని సంస్థలు తమ ఉద్యోగులకు సగటున 10 శాతం జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్‌, తయారీ, ఇంజినీరింగ్‌ రంగాల్లోని ఎంప్లాయీస్‌ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్‌ చేపట్టిన ‘టోటల్‌ రెమ్యునరేషన్‌ సర్వే’ (టీఆర్‌ఎస్‌)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈసారి ఉద్యోగుల జీవితాలు సగటు 10 శాతం పెరుగవచ్చని సర్వేలో తేలింది. ఇదిలా ఉంటే గతేడాది దేశంలో ఉద్యోగుల సగటున 9.5 శాతం ఉన్నట్లు మెర్సర్స్‌ తమ తాజా రిపోర్టులో పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి ఇదొక నిదర్శనమని సర్వేలో తేలింది. దేశంలో ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారనడానికి ఇదొక సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇక సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ఈ ఏడాది పలు రంగాల్లో జీతాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆటోమొబైల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇంజినీరింగ్‌, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు అని సర్వేలో తేలింది. గత ఏడాది మే, ఆగస్టు మధ్యలో నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించారు. ఇందులో భాగంగా 1,474 సంస్థల్లోని 6 వేల మందికిపైగా అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సంస్థల్లో 21 లక్షల మందికిపైగా ఉద్యోగులుండటం విశేషం. వ్యక్తిగత, సంస్థాగత పనితీరు తదితర అంశాల ప్రాతిపదికన ఈ సర్వేను నిర్వహించారు. మరోవైపు కంపెనీలను ఉద్యోగులు స్వచ్చంధంగా వీడుతున్న సందర్భాలు క్రమేణా పెరుగుతున్నాయని, 2021లో 12.1 శాతంగా ఉంటే, 2022లో 13.5 శాతంగా ఉందని సర్వే తెలిపింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..