భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) 260 అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 2023-24 సంవత్సరానికి గానూ అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ కింద నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఫ్రూట్ సైన్స్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిష్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు జులై 26, 2023వ తేదీ సాయంత్రం 5:30 గంటలలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జులై 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో నెట్ పరీక్షకు జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. రాత పరీక్ష అక్టోబర్/నవంబర్‌లో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.