AI Jobs: ఇక భవిష్యత్‌ అంతా ఈ రంగానిదే.. భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగకల్పన.

నౌక్రి జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఈ ఏడాది జనవరిలో నెలలో హెల్త్‌ కేర్‌, హాస్పిటాలిటీ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ రంగాల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాల నియామకాలు గలణనీయంగా పెరిగినట్లు నౌక్రి జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ నివేదికలో తెలిపారు. దీని ప్రకారం...

AI Jobs: ఇక భవిష్యత్‌ అంతా ఈ రంగానిదే.. భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగకల్పన.
AI Jobs

Updated on: Feb 06, 2024 | 5:58 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీతో పాటు మరెన్నో నిత్యవసర రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇందుకోసం భారీగా పెట్టుబడులు సైతం పెడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజా గణంకాల ప్రకారం ఆర్టిఫిషియల్‌ సంబంధిత రంగాల్లో భారీగా ఉద్యోగకల్పన పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నౌక్రి జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఈ ఏడాది జనవరిలో నెలలో హెల్త్‌ కేర్‌, హాస్పిటాలిటీ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ రంగాల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాల నియామకాలు గలణనీయంగా పెరిగినట్లు నౌక్రి జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ నివేదికలో తెలిపారు. దీని ప్రకారం భారత్‌లో జనవరి నెలలో 2455 వైల్‌ కాలర్‌ నియామకాలు జరిగినట్లు తెలిపారు. ఇది గత నెలతో పోల్చితే ఒక శాతం పెరుగుదలగా చెబుతున్నార. సీనియర్‌ నిపుణులు, ప్రీమియం ఉద్యోగార్థులకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఏఐ రంగంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరి కొత్త నియామకాలు 12 శాతం పెరిగినట్లు నివేదికలో తెలిపారు.

ఈ విషయమై నౌక్రి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పవన్‌ గోయల్ మాట్లాడుతూ.. ఏఐ సంబంధిత ఉద్యోగాల్లో గణనీయమైన పెరుగుదల ఐటీ రంగంలో మారుతున్న నైపుణ్య అవసరాలను సూచిస్తోంది. అలాగే హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ, ఫాస్ట్‌మూవీంగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌లలో నియామకాలు పెరగడం బలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక నివేదిక ప్రకారం.. మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌, ఫుల్‌ స్టాక్‌ ఏఐ సైంటిస్ంట్‌ వంటి రోల్స్‌ కోసం వరుసగా 46 శాతం, 23 శాతం నియామకాలు పెరిగినట్లు తేలింది. డేటా సైంటిస్ట్‌ వంటి సంప్రదాయ ఏఐ రోల్స్‌ కూడా మంచి డిమాండ్‌ ఉంది.

అయితే ఐటీ రంగంలో మొత్తం నియామకాలు గతేడాది జనవరితో పోల్చితే 19 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. జనవరిలో హెల్త్‌ రంగంలో నియామకాల 7 శాతం పెరిగాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ రోల్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇక నియామకాలలో క్షీణత ఉన్న రంగాల్లో బీపీఓ, బీమా రంగాలు ఉన్నాయి. బీపీఓలో 16 శాతం, బీమా రంగంలో 8 శాతం ఉద్యోగ నియామకాల్లో క్షీణత కనిపించింది. ఇక విద్య, రిటైల్ రంగాలు 7 శాతం చొప్పున క్షీణించాయని నివేదికలో తేలింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..