Artillery Hyderabad Recruitment: పది/ఇంటర్‌ అర్హతతో.. హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

|

Mar 26, 2022 | 9:08 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్‌లో (Artillery Centre Hyderabad) గ్రూప్‌ సీ, డీ పోస్టుల భర్తీకి..

Artillery Hyderabad Recruitment: పది/ఇంటర్‌ అర్హతతో.. హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!
Defence Jobs
Follow us on

Artillery Centre Hyderabad Group C, D Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్‌లో (Artillery Centre Hyderabad) గ్రూప్‌ సీ, డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ, డీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

  • డ్రాప్ట్స్‌ మ్యాన్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
    పే స్కేల్‌: నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఎంటీఎస్ పోస్టులకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
    పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • బూట్‌ మేకర్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
    పే స్కేల్‌: నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఎండీసీ పోస్టులకు ఇంటర్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
    పే స్కేల్‌: నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల పాటు జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Commandant, Headquarters, Artillery Centre, Ibrahimbagh Lines (Post), Hyderabad, PIN-500031.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19, 2022. (ప్రకటన విడుదలైన 28 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Steel Soap: స్టెయిన్ లెస్‌ స్టీల్‌ సబ్బు ఎప్పుడైనా చూశారా? నురగ రాదు.. వాసనుండదు!