తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి మెట్రిక్యులేషన్/10+2/అండర్ గ్రాడ్యుయేషన్/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధులకు సంబంధిత పనిలో 0 నుంచి ఐదేళ్ల వరకు అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. దరఖాస్తులను అక్టోబర్ 10, 2023 వ తేదీలోపు కింది అడ్రస్కు పంపించాలి.
ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, ఇబ్రహింబాగ్ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 500031.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్షా సొసైటీ పరిధిలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను విడుదల చేసింది. మొత్తం 396 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. వీటిని తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన మొత్తం భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇంటర్, డిగ్రీ, పీజీ, స్పెషల్ బీఈడీ/డీఈడీ అకడమిక్ మార్కులతోపాటు టీచింగ్ అనుభవం, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
APSS జిల్లాల వారీగా మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.