Job Mela: ప్రైవేటు కంపెనీల్లో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరచూ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని పలు జిల్లాల వారీగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సిద్ధమైంది. అరబిందో ఫార్మా కంపెనీలో ఏకంగా 475 ఖాళీల భర్తికీ ఇంటర్వ్యూలను నిర్హిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* జాబ్‌మేళాలో భాగంగా అబరిందో ఫార్మాలో డిపార్ట్‌మెంట్ క్యూసీ, ప్రొడక్షన్, ప్యాకింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో 475 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* 2018-22 వరకు పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు ముందుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 11న ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
* అభ్యర్థులను టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం 8639015530, 6301006979 నంబర్లను సంప్రదించండి.
@AP_Skill has Collaborated with #AurobindoPharma to Conduct Industry Customized Skill Training & Placement Program #PrakasamDistrict
Registration Link https://t.co/XnrotfY4b3
Contact: N. Venu Gopal: 86390 15530
Ms. R. Sai Praneetha – 6301006979
APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/2WWqqpQmoA— AP Skill Development (@AP_Skill) July 6, 2022
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..