APSACS Recruitment: కర్నూలు జిల్లాలో మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.?

|

Aug 24, 2022 | 6:47 PM

APSACS Recruitment: కర్నూలు జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకుల్లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కర్నూలులోని...

APSACS Recruitment: కర్నూలు జిల్లాలో మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.?
Ap Medical Jobs
Follow us on

APSACS Recruitment: కర్నూలు జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకుల్లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కర్నూలులోని కుష్ఠు, ఎయిడ్స్ & క్షయ నియంత్రణ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెడికల్ ఆఫీసర్ (02), ఏఆర్‌టీ కౌన్సెలర్ (01), బ్లడ్ బ్యాంక్ కౌన్సెలర్ (01), డీఎస్‌ఆర్‌సీ కౌన్సెలర్ (01), ఐసీటీసీ & పీపీటీసీటీ కౌన్సెలర్ (11), ఏఆర్‌టీ డేటా మేనేజర్ (01), స్టాఫ్ నర్స్ (04), ఎస్‌ఆర్‌ఎల్‌- టెక్నికల్ ఆఫీసర్ (01), ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్ (01), ఏఆర్‌టీ ల్యాబ్ టెక్నీషియన్ (03) ఐసీటీసీ & పీపీటీసీటీ ల్యాబ్- టెక్నీషియన్ (10) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, డీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, పీజీ, ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్‌ను కుష్ఠు, ఎయిడ్స్ & క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, గవర్నమెంట్‌ క్వార్టర్స్‌, బీక్యాంపు, కర్నూలు అడ్రస్‌కు అందించాలి.

* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 30-08-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..