APSACS Anantapuramu Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. అనంతపురం జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. జీతం రూ.72,000లు..

|

Aug 13, 2022 | 7:11 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్ ప్రొగ్రామ్ (APSACS Anantapuramu) కింద ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన 22 ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్..

APSACS Anantapuramu Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. అనంతపురం జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. జీతం రూ.72,000లు..
Apsacs
Follow us on

APSACS Anantapuramu Paramedical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్ ప్రొగ్రామ్ (APSACS Anantapuramu) కింద ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన 22 ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు పదోతరగతి, ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు ఆగస్టు 22, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.10,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • ఐసీటీసీ కౌన్సెలర్ పోస్టులు: 3
  • ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 6
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 3
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 5
  • కౌన్సెలర్ ఆర్ట్ పోస్టులు: 1
  • ఎస్‌టీఐ కౌన్సెలర్ పోస్టులు: 1
  • బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • బ్లడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ డ్రైవర్ పోస్టులు: 1
  • బ్లడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ అటెండర్ పోస్టులు: 1

అడ్రస్: District Leprosy AIDS & TB Officer, Ananthapuramu District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.