APPSC Job Results 2025: ఏపీపీఎస్సీ రాత పరీక్షలు మీరూ రాశారా? ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ పరిధిలో పలు పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షా ఫలితాలను..

అమరావతి, అక్టోబర్ 11: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ పరిధిలో పలు పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రాథమికు ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తన ప్రకటనలో తెలిపింది. ఇక ఇప్పటికే అటవీశాఖ సెక్షన్ అధికారి, బీట్, సహాయ బీట్ అధికారి పోస్టులకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి త్వరలోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూపీఎస్సీ సీడీఎస్ 2 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS-2) 2025 పరీక్ష ఫలితాలను తాజా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసిన ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూపీఎస్సీ సీడీఎస్ 2 మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు లక్షలాది మంది హాజరవగా ఇందులో మొత్తం 9,085 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరంతా ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ 453 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
యూపీఎస్సీ సీడీఎస్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




