APPSC: ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..

|

Sep 29, 2022 | 7:58 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయుష్‌ విభాగంలో ఉన్న మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు...

APPSC: ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..
APPSC Group 1
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయుష్‌ విభాగంలో ఉన్న మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 53 మెడికల్‌ ఆఫీసర్‌ (హోమియోపతి) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హోమియోపతిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-10-2022న మొదలై 21-10-2022తో ముగియ నుంది.

* రాత పరీక్షను 2022 నవంబర్‌ నెలలో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..