APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

|

Oct 13, 2021 | 8:43 AM

APPSC Notification: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Job Alert
Follow us on

APPSC Notification: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 38 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అత్యధికంగా ఆర్థిక గణాంక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు – 29 పోస్టులు ఉండగా, సమాచార శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ అధికారులు -6, వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారి – 1, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -02 పోస్టులు ఉన్నాయి. అసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజులు వంటి వివరాల కోసం ఎపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని తెలిపారు. ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఉద్యోగానికి సెలక్ట్ అయిన విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్ల వేరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని, దీనికి సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.

Also read:

Worlds Oldest Tree: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..! ఏమైంది అంటే..? (వీడియో )

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ

SingleVoteBJP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ‘‘ఒక్క ఓటు’’.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు..