APPSC JL Results 2025: జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. మెరిట్‌ లిస్ట్‌ ఇదిగో!

APPSC Junior lecturers 2025 Results: జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు రాత పరీక్షలు ఈ ఏడాది జులై నెలలో ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామక రాత పరీక్ష ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు..

APPSC JL Results 2025: జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. మెరిట్‌ లిస్ట్‌ ఇదిగో!
APPSC 2025 JL Results

Updated on: Dec 04, 2025 | 7:33 AM

అమరావతి, డిసెంబర్‌ 4: ఆంధప్రదేశ్‌లో జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు రాత పరీక్షలు ఈ ఏడాది జులై నెలలో ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామక రాత పరీక్ష ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్‌ 16, 17 తేదీల్లో ధ్రువ పత్రాల పరీశీలన జరగనుందని తన ప్రకటనలో కమిషన్‌ వెల్లడించింది. అభ్యర్ధులు తమ కాల్‌ లెటర్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సూచించింది.

ఏపీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన మెరిట్‌ లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47 (క్యారీ ఫార్వర్డ్‌) లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ విద్యా శాఖ తరఫున ఈ ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జులైలో రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్, ఎంజీ రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ – 520010 చిరునామాకు రావాల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లే అభ్యర్థులు చెక్ లిస్ట్‌లో పేర్కొన్న విధంగా మెమోలు, ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.