APPSC Group 1 Mains Exam Dates: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటినుంచంటే?

|

Jan 22, 2025 | 6:31 AM

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం (జనవరి 21) ఏపీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మొత్తం ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజుల పాటు జరగనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటాయి. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది..

APPSC Group 1 Mains Exam Dates: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటినుంచంటే?
APPSC Group 1 Mains schedule
Follow us on

అమరావతి, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ ) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను మంగళవారం (జనవరి 21) ప్రకటించింది. ఈ మేరకూ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజులు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది. వివాదాలకు తావులేకుండా ఈసారి కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ లలో పొందుపరచి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి పేర్కొన్నారు.

కాగా 2023 డిసెంబర్‌లో 89 గ్రూప్‌ 1 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేమగా గతేడాది మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1:50 ప్రాతిపదికన 4,496 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరందరికీ మే నెలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పరీక్ష కేంద్రాల్లో మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • మే 3వ తేదీన తెలుగు పేపర్‌ (అర్హత పరీక్ష) పరీక్ష జరుగుతుంది
  • మే 4వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌ (అర్హత పరీక్ష) పరీక్ష జరుగుతుంది
  • మే 5వ తేదీన పేపర్‌–1.. జనరల్‌ ఎస్సే పరీక్ష జరుగుతుంది
  • మే 6వ తేదీన పేపర్‌–2.. భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 7వ తేదీన పేపర్‌–3.. పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్‌ ఎథిక్స్‌ అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 8వ తేదీన పేపర్‌–4.. భారత, ఆంధ్రప్రదేశ్‌ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 9వ తేదీన పేపర్‌–5.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలపై పరీక్ష జరుగుతుంది

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.