APPSC Group 1 Hall Tickets 2024: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్లు విడుదల

|

Mar 10, 2024 | 3:42 PM

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 ప్రాథమిక (ప్రిలిమ్స్‌) పరీక్ష హాల్‌టికెట్లు ఆదివారం (మార్చి 10) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాలలో మొత్తం 301 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే..

APPSC Group 1 Hall Tickets 2024: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్లు విడుదల
APPSC Group 1 Hall Tickets
Follow us on

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 ప్రాథమిక (ప్రిలిమ్స్‌) పరీక్ష హాల్‌టికెట్లు ఆదివారం (మార్చి 10) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాలలో మొత్తం 301 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది.

రెండు పేపర్లను ఒకటే రోజున నిర్వహించనున్నారు. ఉదయం పేపర్‌ 1 పరీక్ష 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందని వివరించింది. అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని, కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే వెళ్లి చూసుకోవాలని కమిషన్‌ సూచించారు. ఫలితంగా పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రిలిమ్స్‌ రెండు పేపర్లలో ప్రశ్నల సరళి ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్‌లో ప్రతిభకనబరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.