
అమరావతి, ఆగస్టు 30: రాష్ట్రంలో 508 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నెల రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సన్నద్ధమయ్యే ఔత్సాహికులు ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ పై దృష్టి నిలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త సిలబస్ విడుదల చేసింది కూడా. మొత్తం 450 మార్కులకు గాను ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనుంది. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఈ సారి ప్రిలిమ్స్ పరీక్షలో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు.
ఈ పరీక్ష మొత్తం150 మార్కులకు 150 ప్రశ్నలకు ఉంటుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు 300 మార్కులకు 300 ప్రశ్నలకు ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.