Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..!

|

Apr 24, 2021 | 10:12 PM

Bank of Baroda Jobs: నిరుద్యోగులకు బరోడా బ్యాంక్‌ శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న 511 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మేనేజర్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ...

Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..!
Bank Of Baroda
Follow us on

Bank of Baroda Jobs: నిరుద్యోగులకు బరోడా బ్యాంక్‌ శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న 511 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మేనేజర్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులు చేసుకునేందుకు అఖరు తేదీ ఏప్రిల్‌ 29. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఆ తేదీలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సీనియర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్స్‌ విభాగంలో అత్యధికంగా 407 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. మూడేళ్ల పాటు రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా ఏదైనా బ్యాంకులో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న వారి వయసు 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ విభాగంలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా కోర్సులో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 23-35 ఏళ్లు ఉండాలి. టెర్రిటరీ హెడ్స్ విభాగంలో 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంబంధిత విభాగంలో ఆరేళ్ల అనుభవం ఉండాలి. అందులో రెండేళ్లు టీమ్ లీడర్ గా పని చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే ప్రాడక్ట్‌ హెడ్స్‌ విభాగంలో ఒక ఖాళీ, ఆపరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్‌ విభాగంలో ఒక ఖాళీ, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌ విభాగంలో మరో ఖాళీ, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్‌ విభాగంలో ఒకటి ఖాళీ ఉంది. డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఇవీ చదవండి: Southern Railway Jobs: రైల్వే పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌… దరఖాస్తు గడువు మే 3 వరకు

TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు