AP Vaidya Vidhana Parishad Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ వైవ్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీవీవీపీలో ఏకంగా 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా.. గైనకాలజీ (269), పీడియాట్రిక్స్ (11), అనెస్తీషియా (64), జనరల్ మెడిసిన్ (30),జనరల్ సర్జరీ (16), ఆర్థోపెడిక్స్ (12), పాథాలజీ (05), ఆప్తాల్మాలజీ (09), రేడియాలజీ (21), సైకియాట్రీ (02), డెర్మటాలజీ (06), ఈఎన్‌టీ (08) విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
* అభ్యర్థులను అకడెమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 14-06-2021 నుంచి ప్రారంభం కాగా.. చివరి తేదీని 28-06-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
NIRDPR Recruitment 2021: హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..