AP TET 2022 Application Last Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 (AP TET 2022) నోటిఫికేషన్ శుక్రవారం (జూన్ 10) విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో సాధించిన మార్కులకు, టెట్ నుంచి 20 శాతం వెయిటేజీ మార్కులు కలపడం జరుగుంది. అందుకుగానూ ఉపాధ్యాయనియామక ప్రక్రియ చేపట్టడానికి ముందు టెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ యేడాది టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 6 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఐతే పరీక్షకేంద్రాల (Examination Centre) సర్దుబాటు విషయమై విద్యాశాఖ నూతన నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంటే మొదట దరఖాస్తు చేసుకున్నవారికే రాష్ట్రంలో పరీక్ష కేంద్రాం కేటాయిస్తారన్నమాట.
చివరి తేదీ.. చివరి నిముషం.. వరకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధులు పరీక్ష రాయడానికి రాష్ట్ర సరిహద్దులు దాటవల్సిన సరిస్థితి నెలకొంది. స్థానికంగా కంప్యూటర్ కేంద్రాలు లేవనే సాకుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెల్పింది. దీంతో నిరుద్యోగుల్లో గుబులు నెలకొంది. ఇప్పటికే పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.500 చెల్లించాలి. తప్పుడు వివరాలు నమోదు చేస్తే మరో రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్ధులు వేరువేరుగా రెండు పేపర్లకు ఫీజు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లడంతోపాటు వసతికి అయ్యే ఖర్చులతో కలుపుకుంటే తడిసిమోపెడయ్యే పరిస్థితి నొలకొంది.
నోటిఫికేషన్ వివరాలు క్లుప్తంగా మీకోసం..
అర్హతలు: పేపర్ 1, పేపర్ 2 పరీక్షలను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్/యూజీడీపీఈడీ/డీపీఈడీ/బీపీఈడీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. 2020-22 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చుసుకోవచ్చు.
కేటగిరీల వారీగా పాస్ మార్కులు ఇలా..
పరీక్ష కేంద్రాలు: ఏపీకి చెందిన అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశా.
దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష (CBT) విధానంలో జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.